అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న 28 మందిని బైండోవర్ (Bindover) చేశారు. ఈమేరకు అదనపు మేజిస్ట్రేట్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట మంగళవారం బైండోవర్ నిర్వహించారు.
CP Sai Chaitanya | పండుగలు ఉన్న నేపథ్యంలో..
గణేష్ చవితి (Ganesh Chavithi), మిలాద్-ఉన్-నబీ(Milad-un-Nabi), దుర్గామాత ఉత్సవం (DurgaMatha Festival) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ (Armoor Division) పరిధిలో వివిధ స్టేషన్లలో ఆయా నేరాలపై కేసులు నమోదైన వారికి ఆర్నెళ్లపాటు సత్ప్రవర్తన నిమిత్తం బైండోవర్ చేశారు.
డీజే యజమానులకు రూ.2 లక్షలు, ట్రబుల్ మాంగర్స్కు రూ. లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50వేలు సొంత పూచీకత్తుపై సీపీ ఎదుట బైండోవర్ నిర్వహించారు. పూచీకత్తు సమయంలో మళ్లీ నేరాలకు పాల్పడితే జమచేసిన మొత్తం రద్దుతో పాటు శిక్షలు విధిస్తామని పోలీసులు తెలిపారు. కాగా.. గత నాలుగైదు రోజుల క్రితం కూడా 13 మందిని సీపీ ఎదుట బైండోవర్ చేసిన విషయం తెలిసిందే.