అక్షరటుడే, వెబ్‌డెస్క్: Betting Websites Ban | ఆన్‌లైన్ బెట్టింగ్తో (online betting) దేశంలో ఎంతో మంది అప్పుల పాలు అవుతున్నారు. అప్పులు తీర్చలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై (online betting websites) చర్యలు చేపట్టింది.
దేశంలో గతేడాది అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కింద శుక్రవారం ప్రభుత్వం పలు బెట్టింగ్, జూదం వెబ్‌సైట్‌లపై (gambling websites) నిషేధం విధించింది. 242 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 7,800 కంటే ఎక్కువ అటువంటి ప్లాట్‌ఫారమ్‌లను తొలగించారు. ఆన్‌లైన్ గేమింగ్ చట్టం (online gaming law) అమలులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్ కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది.
Betting Websites Ban | ఎంతో మంది బలి
ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలుగా మారుతున్నారు. యువత ఎక్కువగా దీనికి అలవాటు పడి అప్పుల పాలు అవుతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం గతంలో అనేక యాప్‌లు, వెబ్సైట్లను నిషిధించింది. అయితే రోజుకో కొత్తరకం ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్లు, యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కేంద్రం నిషేధం విధించడంతో ముఖ్యంగా యువతను రక్షించడానికి, అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో కలిగే ఆర్థిక హానిని అరికట్టడానికి వీలు కలిగింది.
Betting Websites Ban | గతేడాది అమలులోకి
గత సంవత్సరం ఆగస్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీనిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, దానిని అమలులోకి తెచ్చారు. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇది ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం కోసం ప్రయత్నిస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనదారులు, ప్రమోటర్లు, అటువంటి ప్లాట్‌ఫామ్‌లకు నిధులు సమకూర్చే వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.