41
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | వారం రోజుల్లో 232 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad City | నగరంలో విస్తృత తనిఖీలు..
కమిషనరేట్ పరిధిలో వారం రోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహించామని సీపీ తెలిపారు. ఈ క్రమంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల (traffic police stations) పరిధిలో తనిఖీలు జరిగాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 5 నుంచి 9 వరకు వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. వీరికి న్యాయస్థానం రూ.22,40,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో ఆరుగురికి వారంరోజుల పాటు జైలు శిక్ష విధించారని సీపీ వివరించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు.