Bhadradri Kothagudem | కారు డిక్కీలో 200 కిలోల గంజాయి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhadradri Kothagudem | దేశంలో గంజాయి, డ్రగ్స్​ దందా ఆగడం లేదు. గంజాయి రవాణా, విక్రయిస్తున్న వారిని నిత్యం పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా పోలీసులు 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశాలో గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు స్మగ్లర్లు గంజాయి సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)​కు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhadradri Kothagudem | దేశంలో గంజాయి, డ్రగ్స్​ దందా ఆగడం లేదు. గంజాయి రవాణా, విక్రయిస్తున్న వారిని నిత్యం పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా దందా మాత్రం ఆగడం లేదు.

తాజాగా పోలీసులు 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశాలో గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు స్మగ్లర్లు గంజాయి సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)​కు సైతం గంజాయి ఎక్కువ శాతం ఆ ప్రాంతం నుంచే వస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయన్నపేట (Sayannapet) ఎక్స్ రోడ్డు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఓ కారు డ్రైవర్​ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కారు చెట్టును ఢీకొంది. దీంతో పోలీసులు కారులో తనిఖీలు చేపట్టగా గంజాయి లభ్యం అయింది.

Bhadradri Kothagudem | రాజస్థాన్​కు తరలిస్తుండగా..

కారు డిక్కీలో పోలీఉలు 100 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 200 కిలోల గంజాయితో పాటు రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​ లాల్ సింఘ్​ను అరెస్ట్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి రాజస్థాన్ (Rajasthan)​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా నిందితుడు లాల్​సింగ్​ గతంలో సైతం ఓ సారి అరెస్ట్​ అయ్యాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయాడు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...