అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం కామారెడ్డి కోర్టు (Kamareddy Court) తీర్పు వెలువరించింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2021 నవంబర్ 4న బాన్సువాడ మండలం (Banswada Mandal) కొల్లూరుకు చెందిన మహేష్ ఓ బాలికను షాపునకు తీసుకెళ్తానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడి చేసాడు.
ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బయపెట్టి మరోసారి కూడా ఇంటికి రావాలని బలవంతపెట్టగా బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. వెంటనే బాలిక తల్లి బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్లో (Banswada Town Police Station) ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సమర్పించగా గురువారం వైద్య నివేదికను పరిశీలించిన జిల్లా ప్రథమ న్యాయమూర్తి సీహెచ్ వరప్రసాద్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.70వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
