అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Prajavani | జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుంచి మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయి.
అనంతరం ఫిర్యాదుదారుల సమస్యలను సీపీ ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ల ఎస్సైలు, సీఐలకు (SI and CI) ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ ప్రజావాణి కార్యక్రమం (Police Prajavani program) ప్రజల కోసమేనన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా నిర్భయంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు అందించవచ్చన్నారు.
చట్టప్రకారం పరిష్కార మార్గాలను చూస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు (Police) ప్రజలకు మరింత దగ్గరయ్యేలా.. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ స్పష్టం చేశారు.