అక్షరటుడే, ఇందూరు: Police Prajavani | జిల్లాలోని ప్రజల చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు సీపీ సాయిచైతన్య (Cp Sai chaitanya) పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలు నేరుగా తమను సంప్రదించవచ్చని సూచిస్తున్నారు.
ఈ మేరకు సోమవారం సీపీ కార్యాలయంలో (CP Office) పోలీస్ కమిషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను సీపీకి అందజేశారు. దీంతో తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల సీఐలు, ఎస్సైలకు ఫోన్లో మాట్లాడి సమస్య పరిస్థితి, పరిష్కారానికి పలు సూచనలు చేశారు.
Police Prajavani | నిర్భయంగా సేవల్ని వినియోగించుకోవలి
పోలీస్ ప్రజావాణికి మొత్తం 18 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలకు తావులేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు.