You Tube Channels | భారత్​లో 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం.. బీబీసీపైనా అసంతృప్తి

అక్షరటుడే, న్యూఢిల్లీ:You Tube Channels | పహల్గావ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత ప్రోవొకేటివ్ (ఉత్తేజిత), మతపరమైన ఉద్రేకాన్ని కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం(India Government) నిషేధించింది. ఈ ఛానళ్లకు భారత్​లో సుమారు 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు(63 million subscribers) ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు వీటిని నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిషేధిత ఛానళ్ల జాబితాలో ఉన్నవి.. ప్రముఖ న్యూస్ ఛానళ్లు: […]

అక్షరటుడే, న్యూఢిల్లీ:You Tube Channels | పహల్గావ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత ప్రోవొకేటివ్ (ఉత్తేజిత), మతపరమైన ఉద్రేకాన్ని కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం(India Government) నిషేధించింది. ఈ ఛానళ్లకు భారత్​లో సుమారు 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు(63 million subscribers) ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు వీటిని నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నిషేధిత ఛానళ్ల జాబితాలో ఉన్నవి..

ప్రముఖ న్యూస్ ఛానళ్లు: Dawn, ARY News, Samaa TV, Bol News, Geo News, Suno News, Raftar.

జర్నలిస్టుల యూట్యూబ్ ఛానళ్లు..

ఇర్షాద్ భట్టి, ఉమర్ చీమా, అస్మా షిరాజీ, మునీబ్ ఫారూక్.

ఇతర ఛానళ్లు..

The Pakistan Reference, Uzair Cricket, Samaa Sports, Razi Naama.

ఈ ఛానళ్లన్నీ భారత్, భారత సైన్యం(Indian Army), భద్రతా సంస్థలపై తప్పుడు, దుష్ప్రచార కథనాలను ప్రచారం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. పహల్గావ్​ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక కాశ్మీరీ మృతి చెందారు.

ఈ ఛానళ్లను భారతదేశంలో యాక్సెస్ చేయాలంటే “ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ కంట్రీలో అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం జాతీయ భద్రత / ప్రజా ప్రవర్తనకు సంబంధించిన అంశంగా పరిగణించి నిలిపివేయబడింది.” అనే సందేశం కనిపిస్తోంది.

భారత్​ కఠిన చర్యలు..

పహల్గావ్​ దాడి(Pahalgam Attack)లో పాకిస్తాన్ పాత్ర ఉందన్న అనుమానంతో భారత్ పలు చర్యలు చేపట్టింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తానీ పౌరులకు ఇచ్చే వీసా సేవలను(Visa services) నిలిపివేసింది. ఇందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేయడానికి తమకు కూడా హక్కు ఉందని ప్రకటించింది.

బీబీసీపై ప్రభుత్వ అసంతృప్తి

బీబీసీ BBC Channel హెడ్​లైన్​ “Pakistan suspends visas for Indians after deadly Kashmir attack on tourists” అంటూ రాయడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు “భారత్ పర్యాటకులపై దాడి చేసినట్లుగా కనిపిస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈమేరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం(Central government) బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు దేశ భావోద్వేగాలను తెలియజేస్తూ.. లేఖ పంపినట్టు సమాచారం. బీబీసీ ‘టెర్రరిస్ట్స్’ స్థానంలో ‘మిలిటెంట్స్’ అనే పదాన్ని వాడటంపై సైతం ప్రభుత్వం తప్పుబడుతోంది. బీబీసీ రిపోర్టింగ్‌(BBC reporting)ను నిరంతరం గమనించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

 

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...