అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Conferred IAS | తెలంగాణ రెవెన్యూ శాఖ (Revenue Department)లో పనిచేస్తున్న 16 మంది అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్ (IAS)లుగా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు కేంద్ర వ్యవహారాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర సివిల్ సర్వీస్ (SCS) అధికారులను వారి సర్వీస్, పనితీరు, ఖాళీల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) కేడర్‌లోకి ప్రమోట్ చేయడాన్ని కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు. అర్హత, సీనియారిటీ, నిబంధనల మేరకు పదోన్నతి కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఖాళీల వివరాల ఆధారంగా కేంద్రం తాజాగా 16 మందికి ప్రమోషన్ కల్పించింది.
Conferred IAS | ప్రమోషన్ పొందింది వీరే..
డి మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జె భవాని శంకర్, జె లింగ్యా నాయక్, ఏ నర్సింహా రెడ్డి, జీ వీరారెడ్డి, జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్, రఘురామ్‌శర్మ, పి చంద్రయ్య, జీ ముకుంద రెడ్డి, ఏ భాస్కర్ రావు, వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, బీ వెంకటేశ్వర్లు, ఎన్ కీమ్య నాయ్, కె గంగాధర్. వీరు కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ప్రమోషన్ పొందారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజేశ్‌కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.