HomeUncategorizedData Leak | 16 కోట్ల మంది డేటా లీక్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద డేటా చోరీ

Data Leak | 16 కోట్ల మంది డేటా లీక్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద డేటా చోరీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Data Leak | ప్ర‌పంచంలోనే అతిభారీ డేటా చోరీ వెలుగులోకి వ‌చ్చింది. యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్ వంటి ప్రపంచ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల నుంచి డేటా త‌స్క‌రించ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. ఏకంగా 16 బిలియన్ల‌ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచం(Cyber ​​world)లో సంచలనం రేకెత్తిస్తోంది. గూగుల్, యాపిల్, గిట్ హబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ మొదలు ప్రభుత్వ సర్వీసుల వరకూ అనేక సంస్థల్లోని యూజర్ల లాగిన్ క్రెడెన్షియల్స్(User login credentials) బయటకు పొక్కడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఫోర్బ్స్ ఓ సంచలన నివేదిక వెలువరించింది. 16 కోట్ల మంది వ్య‌క్తిగ‌త వివ‌రాలు లీక్ కావ‌డం ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డేటా లీకేజీగా సైబర్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్స్ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్‌లు(Phishing scams), గుర్తింపు దొంగతనం, ఖాతా హ్యాకింగ్‌కు ఇది దారితీస్తుందన్న ఆందోళ‌న నెల‌కొంది. 30 డేటాసెట్‌లను కనుగొన్న రీసెర్చ‌ర్స్‌.. వాటిలో ప్రతి ఒక్కటి 3.5 బిలియన్ రికార్డులను కలిగి ఉంద‌ని తెలిపారు. సోషల్ మీడియా, VPN లాగిన్‌లతో పాటు కార్పొరేట్, డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న సమాచారం డేటాసెట్‌లలో ఉందని పేర్కొన్నారు. “ఇది కేవలం లీక్ కాదు – ఇది సామూహిక దోపిడీకి ఒక బ్లూప్రింట్. ఇవి రీసైకిల్ చేయబడుతున్న పాత ఉల్లంఘనలు మాత్రమే కాదు. ఇది ఆయుధీకరించదగిన మేధస్సు” అని పరిశోధకులు అన్నారు.

Data Leak | భారీ డేటా చోరీ..

పాస్‌వర్డ్‌లతో సహా 16 బిలియన్ లాగిన్ ఆధారాలు లీక్ అయినట్లు సైబ‌ర్ నిపుణలు(Cyber ​​experts) తెలిపారు. ఇప్పటికే 184 మిలియన్‌ యూజర్ రికార్డులు బట్టబయలు అయినట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు ఏకంగా 16 బిలియన్ లాగిన్ వివరాలు(16 billion login details) బహిర్గతమవడంపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ సాధారణమైన లీక్ కాదని, ఈ డాటాను భారీ స్థాయిలో దుర్వినియోగం చేసే ఆస్కారం ఉందని అంటున్నారు. వీటిని ఆయుధంగా మలిచే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఫిషింగ్ ఎటాక్స్, అకౌంట్ టేకోవర్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ ఎటాక్స్‌కు వినియోగించే అవకాశం ఉందని తెలిపారు.

అత్యంత విలువైన లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇలా బహిర్గతమవడంతో దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని కీపర్ సెక్యూరిటీ కోఫౌండర్, సీఈవో డేరెన్ గుసియోన్ హెచ్చరించారు. ఇది సంవత్సరాలుగా ఉన్న పాత డేటా డంప్ మాత్రమే కాదని 2025 సంవ‌త్స‌రానికి సంబంధించిన డేటా ఉంద‌ని భద్రతా పరిశోధకులు తెలిపారు. మ‌రోవైపు, ఇలాంటి దాడుల జరిగే అవకాశం ఉందని గూగుల్ లాంటి సంస్థలు ముందే ఊహించాయి. యూజర్లు తమ డిజిటల్ అకౌంట్స్‌కు తాళం వేసుకునేందుకు పాస్‌వర్డ్స్‌, టూ ఫాక్టర్ ఆథెంటికేషన్‌లకు బదులు పాస్‌కీ(Passkey)లు వాడాలని చెబుతున్నాయి.