అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) భాగంగా ఎల్లారెడ్డిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారంతో నామినేషన్ల ప్రకియ ముగియనుంది. ఈ మేరకు సోమవారం రెండోరోజు ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తూ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు వేశారు. ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy mandal) 31 గ్రామ పంచాయతీలకు మొదటి రోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 12 వార్డు సభ్యులకు 9 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సోమవారం సర్పంచ్ స్థానాలకు 49 నామినేషన్లు వార్డు సభ్యులకు 78 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా ఎల్లారెడ్డి మండలంలో 61 సర్పంచ్ అభ్యర్థులు 87 మంది వార్డు సభ్యులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.
Yellareddy | రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్, తిమ్మారెడ్డి తండా గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ గ్రామంలో ఎన్నికలు లేకుండా అభివృద్ధిని చేసుకునేందుకు ఏకతాటిపై ఉండేందుకు ఏకగ్రీవాలను చేసుకున్నట్లు ఆయా గ్రామస్థులు తెలిపారు. ఆజామాబాద్ సర్పంచ్‌గా కుమ్మరి మానస, ఉప సర్పంచ్‌గా లింగంపల్లి సాయిలు, వార్డు సభ్యులుగా రావుల లక్ష్మి, చిన్నబోయిన నాగరాజు, కుమ్మరి లచ్చరాం, లింగంపల్లి సాయిలు, తుపాకీ ఏసుమణి, ప్రభుదాస్, శారదకాని సాయిలు, గాండ్ల కవితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Yellareddy | తిమ్మారెడ్డి తండాలో..
తిమ్మారెడ్డి తండా (Thimmareddy Thanda) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కోలరాములు నాయక్, ఉపసర్పంచ్‌గా విస్లావత్ మాన్యా నాయక్‌లను తండా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా గ్రామపెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు తీర్మానం చేశారు. వార్డు సభ్యులుగా జ్యోతి, గోవింద్, సాంగీబాయి, రవి, సునీత, మమత, మోహన్, మార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
