Homeక్రీడలుIPL 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం: 1355 మంది రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్.....

IPL 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం: 1355 మంది రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్.. మొత్తం ఖాళీలు 77 మాత్ర‌మే

ఐపీఎల్ 2026పై రోజు రోజుకి ఆస‌క్తి పెరుగుతుంది. ఈ సారి భారీ రిజిస్ట్రేషన్ల సంఖ్యతో ఐపీఎల్ 2026 మినీ వేలం మరింత ఉత్కంఠభరితంగా మారనుంది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2026 | డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం ఈసారి అద్భుతమైన స్పందన లభించింది. మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా రికార్డు సృష్టించారు.

క్రిక్‌బజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది ఇప్పటివరకు మినీ వేలం కోసం నమోదైన అత్యధిక సంఖ్య. మొత్తం 10 జట్లలో కలిపి 77 ఖాళీలు (31 విదేశీ స్లాట్లు) మాత్రమే ఉన్నా ఉండ‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్  వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్ల పర్స్ ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వద్ద రూ. 43.4 కోట్లు ఉన్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 16న జరగబోయే ఈ వేలంలో ఫ్రాంచైజీలు ఎవరిని సొంతం చేసుకుంటాయ‌నే దానిపై జోరుగా చర్చ న‌డుస్తుంది.

IPL 2026 | భారత ఆటగాళ్ల భారీ జాబితా

ఈ జాబితాలో టీమ్ ఇండియా (Team India) తరఫున ప్రాతినిధ్యం వహించిన పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో మయాంక్ అగర్వాల్,కేఎస్ భరత్,రాహుల్ చాహర్,రవి బిష్ణోయ్,దీపక్ హుడా,వెంకటేశ్ అయ్యర్,శివమ్ మావి,నవదీప్ సైనీ,ఉమేశ్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, కేతన్ సకారియా,కుల్దీప్ సేన్, పృథ్వీ షా వంటి పలువురు ఆట‌గాళ్లు ఉన్నారు. రూ. 2 కోట్ల అత్యధిక బేస్ ప్రైస్‌లో భారత ఆటగాళ్లలో రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్ మాత్రమే తమ పేర్లు నమోదు చేయడం విశేషం.ఇక విదేశీ ఆటగాళ్ల నుంచి 43 మంది రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లో పాల్గొంటున్నారు. వారిలో కామెరూన్ గ్రీన్,స్టీవ్ స్మిత్, లియామ్ లివింగ్‌స్టన్, హసరంగ, మతీష పతిరాణా, నోర్ట్జే, జేమీ స్మిత్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.

గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా (Australia) నుంచి భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, మాథ్యూ షార్ట్ లాంటి స్టార్‌లు వేలంలో పాల్గొనబోతున్నారు. వివాహం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చని భావించిన జోష్ ఇంగ్లిస్ కూడా ఈసారి వేలానికి నమోదు కావడం ఆసక్తికరం. ఇంగ్లాండ్ నుంచి జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, శ్రీలంక నుంచి హసరంగ, పతిరాణా, తీక్షణ, అఫ్ఘానిస్తాన్ నుంచి ముజీబ్, నవీన్-ఉల్-హక్ వంటి స్టార్ ప్లేయర్లు జాబితాలో మెరుస్తున్నారు. అదే విధంగా, మలేషియా క్రికెటర్ విరందీప్ సింగ్ కూడా రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తొలిసారిగా రిజిస్టర్ కావడం ప్రత్యేక ఆకర్షణ. నవంబర్ 15న రిటెన్షన్స్ ముగిసిన తర్వాత పది ఐపీఎల్ జట్ల వద్ద కలిపి రూ.237.55 కోట్లు ఖర్చు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఫ్రాంచైజీల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.40 కోట్లు, ఇతర జట్లతో పోలిస్తే KKR ఈసారి ఆక్షన్‌లో భారీ బిడ్లు వేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేలంలో మొత్తం 77 ప్లేయర్ స్లాట్లు ఖాళీగా ఉండ‌గా, అందులో 31 విదేశీ స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

Must Read
Related News