అక్షరటుడే, కామారెడ్డి : CEIR Portal | జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న 127 ఫోన్లను పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికవరీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శుక్రవారం పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
CEIR Portal | రూ.3 కోట్లకు పైగా విలువైన..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గతేడాది రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఇప్పటివరకు రూ.7.05 కోట్ల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగించామన్నారు. గత 15 రోజుల్లో రూ.20.32 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను స్పెషల్ డ్రైవ్ (Special Drive) ద్వారా రికవరీ చేశామన్నారు. మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు (Cyber Scams) జరుగుతున్నాయని, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫోన్ పోతే ఆందోళన వద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. రికవరీ అయిన ఫోన్లను బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు.