అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrender | మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు సరెండర్ అయ్యారు. బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి (Bijapur District Police Officer) ఎదుట తమ ఆయుధాలు అప్పగించారు.
ఆపరేషన్ కగార్ (Operation Kagar) ధాటికి మావోలు కకావికలం అయిన విషయం తెలిసిందే. వందలాది మంది దళ సభ్యులు ఎన్కౌంటర్లలో హతం అయ్యారు. కీలక నేతలు సైతం నేలకొరిగారు. దీంతో మిగతావారు ఉద్యమ బాట వీడి లొంగు‘బాట’ పట్టారు. తాజాగా లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జీ రాందేవ్, డివిజన్ కార్యదర్శి ఉసెండి చందు తదితరులు ఉన్నారు. మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ జోన్‌లో రామ్‌ధేర్ మజ్జీ చురుగ్గా పని చేసేశాడు. ఆయన తన 12 మంది సహచరులతో సహా లొంగిపోయాడు.
Maoists Surrender | నక్సలైట్ రహితంగా..
తాజా లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ దాదాపు మావోయిస్టు రహితంగా మారిందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ, లలిత, జానకి, చందు ఉసెండి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం, లక్ష్మి, షీలా, కవిత, యోగిత, సాగర్ తదితరులు ఉన్నారు. పది ఆయుధాలను వీరు పోలీసులకు అప్పగిచారు. రామ్‌ధేర్ మజ్జిపై రూ.45 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికే భారీగా మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. రానున్న రోజులు ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని బలగాలు పేర్కొంటున్నాయి.
Maoists Surrender | మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కన్హా-భోరామ్‌డియో డివిజన్‌కు చెందిన 10 మంది మావోయిస్టులు ఇటీవల లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్లలో ఒకరైన సురేందర్ అలియాస్ కబీర్ సైతం వీరిలో ఉన్నారు. అతడిపై రూ. 77 లక్షల రివార్డు ఉంది. బాలాఘాట్‌లో భద్రతా దళాల ముందు వారు సరెండర్ అయ్యారు. బాలాఘాట్-మండ్లా జోన్‌లో పనిచేస్తున్న అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులందరూ ఆయుధాలు విడిచిపెట్టారని, మధ్యప్రదేశ్‌లోని నక్సల్ ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి.