108 Ambulance​ | 108 అంబులెన్స్​లో ప్రసవం

అక్షరటుడే, గాంధారి/బాన్సువాడ : 108 Ambulance​ | అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది స్పందించారు. అంబులెన్స్​లలోనే డెలివరీలు నిర్వహించి తల్లీబిడ్డలను కాపాడారు. గాంధారి మండలం(Gandhari Mandal) కరక్​వాడి గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మంగళవారంవ ఉదయం ఆమె భర్త మహేష్​ 108 సిబ్బందికి ఫోన్​ చేశాడు. వెంటనే స్పందించిన అంబులెన్స్​ సిబ్బంది(Ambulance Staff) రమేశ్​, అస్లాం కలిసి మహేష్​ ఇంటికి చేరుకుని కామారెడ్డి జీజీహెచ్​కు తరలిస్తున్న సమయంలో మర్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో […]

అక్షరటుడే, గాంధారి/బాన్సువాడ : 108 Ambulance​ | అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది స్పందించారు. అంబులెన్స్​లలోనే డెలివరీలు నిర్వహించి తల్లీబిడ్డలను కాపాడారు. గాంధారి మండలం(Gandhari Mandal) కరక్​వాడి గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మంగళవారంవ ఉదయం ఆమె భర్త మహేష్​ 108 సిబ్బందికి ఫోన్​ చేశాడు.

వెంటనే స్పందించిన అంబులెన్స్​ సిబ్బంది(Ambulance Staff) రమేశ్​, అస్లాం కలిసి మహేష్​ ఇంటికి చేరుకుని కామారెడ్డి జీజీహెచ్​కు తరలిస్తున్న సమయంలో మర్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని నిలిపేసి అంబులెన్స్​లోనే నార్మల్​ డెలివరీ(Normal Delivery) నిర్వహించారు. తల్లీబాబు క్షేమంగా ఉంటారు. అనంతరం 198 ఈఆర్​సీసీపీ వైద్యడు శివ సలహాతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర స్థితిలో స్పందించిన అంబులెన్స్​ సిబ్బందికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

108 Ambulance​ | బాన్సువాడలో..

అక్షరటుడే, బాన్సువాడ : పట్టణంలోని డబుల్ బెడ్​రూం ఇళ్లలో నివాసముంటున్న సుమలతకు పురిటినొప్పులు ఎక్కువ కాగా.. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చేరింది. లోపల శిశువు మెకోణియం (మలవిసర్జన) చేసినట్లు వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. స్పందించిన 108 సిబ్బంది అంబులెన్స్‌లో సుమలతను తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఆర్​సీసీపీ శివ సూచనల మేరకు అంబులెన్స్ సిబ్బంది రోడ్డు పక్కనే సురక్షితంగా సాధారణ కాన్పు చేశారు. ఈ సందర్భంగా సుమలత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Nizamabad Government Hospital)కి తరలించారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ సుభాష్​కు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...