అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran | ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలాన్ని మూసి వేసింది. దేశంలో హింసాత్మక నిరసన నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
ఇరాన్లో కొన్ని రోజులుగా ఆందోళనలు (Iran Protests) కొనసాగతున్న విషయం తెలిసిందే. ఇవి హింసాత్మకంగా మారాయి. ఆందోళనలను ఖమేని ప్రభుత్వం అణిచి వేస్తోంది. దీంతో ఇరాన్‌పై దాడులు చేస్తామని అమెరికా (America) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ తన గగనతలాన్ని మూసి వేసింది. అనంతరం మళ్లీ ఓపెన్ చేసింది. సుమారు 5 గంటల పాటు గగనతలాన్ని మూసి ఉంచింది.
Iran | కీలక మార్గం
ఇరాన్ వైమానిక ప్రాంతం తూర్పు-పశ్చిమ మార్గంలో ఉంది. తక్కువ సమయంలో వెళ్లడానికి ఇది విమానయాన సంస్థలకు ఉపయోగపడతోంది. తూర్పు-పశ్చిమ విమానయాన మార్గం మధ్యప్రాచ్యం అంతటా యూరప్-ఆసియా వైమానిక కారిడార్, ఇరాన్ వైమానిక ప్రాంతం కేంద్ర లింక్‌గా ఉంది. తాజాగా ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఇరాన్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో విమానయాన సంస్థలకు సమయం, అదనపు ఖర్చు పెరుగుతుంది.
Iran | భారత్‌పై ప్రభావం
భారతీయ విమానయాన సంస్థలు కూడా ప్రభావితమయ్యాయి, ఇరాన్ ఆకస్మిక గగనతల మూసివేతతో దాని అంతర్జాతీయ విమానాలు కొన్ని ప్రభావితమవుతాయని ఇండిగో (Indigo) తెలిపింది. ఎయిర్ ఇండియా (Air India) విమానాలు ఆలస్యం, రద్దుకు దారితీసే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. బుధవారం జర్మనీ దేశ విమానయాన సంస్థలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా హెచ్చరిస్తూ కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. కాగా ఇరాన్ మీదుగా ఎగురుతున్న అన్ని US వాణిజ్య విమానాలను ఆ దేశం ఇప్పటికే నిషేధించింది. ఇరాన్ ఎయిర్ స్పేస్‌ను