ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | పోలీసుల అదుపులో వైఎస్​ జగన్​ డ్రైవరు.. వైసీపీ అధినేతపై మరో కేసు..!

    YS Jagan | పోలీసుల అదుపులో వైఎస్​ జగన్​ డ్రైవరు.. వైసీపీ అధినేతపై మరో కేసు..!

    Published on

    అక్షరటుడే, అమరావతి: YS Jagan : ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని పల్నాడు జిల్లా(Palnadu district) రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత(YSRCP chief), మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్​రెడ్డి (former Chief Minister YS Jagan Mohan Reddy) వాహనం ఢీకొని సింగయ్య మరణించిన చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు వైఎస్ జగన్‌ కారు డ్రైవరుగా ఉన్న ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్‌ రమణారెడ్డి(AR Constable Ramana Reddy)ని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

    ప్రమాదం సమయంలో వాహనం కింద ఒక వ్యక్తి పడినట్లు గుర్తించారా..? ఆ సమాచారాన్ని ​ జగన్‌కు తెలిపారా..? ప్రమాదం జరిగితే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు..? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వైఎస్​ జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

    YS Jagan : ఏ2గా వైఎస్​ జగన్​..!

    ఈ కేసులో ఏ1గా కారు డ్రైవరు రమణారెడ్డి, ఏ2గా జగన్‌, ఏ3గా కారు యజమానిని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన వాహనం ఫార్చూనర్ ఏపీ 40 డీఎస్​ 2349గా నిర్ధారించారు. కారును వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పేరు మీద కొనుగోలు చేసి.. ప్రతినిధిగా జగన్‌ ఓఎస్​డీగా పనిచేసిన కృష్ణ మోహన్​రెడ్డి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. సింగయ్య మరణానికి వైఎస్​ జగన్‌ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో నల్లపాడు పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

    YS Jagan : వెలుగులోకి ఘటన ఇలా..

    పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో భాగంగా ఈ నెల 18న వైఎస్ జగన్​ మోహన్​రెడ్డి గుంటూరు(Guntur)లో ర్యాలీ సందర్భంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించారు. ఆయన మృతికి జగన్ వాహనమే కారణమనే విషయం వీడియో రూపంలో వెలుగు చూసింది. ప్రమాదానికి సంబంధించి వైరల్​ అయిన వీడియోలో వైఎస్​ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే మృతుడు పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏటుకూరు వద్ద ఆయన కాన్వాయ్‌ హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి మలుపు తిరిగే ప్రదేశంలో వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు వైఎస్​ జగన్‌ ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగంలో ఎక్కి బీభత్సం సృష్టించారు.

    ఈ క్రమంలో వైఎస్ జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదులుతుండగా సింగయ్య ఆ వాహనం కిందే పడినట్లు దృశ్యాల్లో స్పష్టంగా తెలుస్తోంది. వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తూ డ్రైవర్‌కు సైగలు చేసి అప్రమత్తం చేసినా వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్​ జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదని వీడియో చూస్తే తెలుస్తోంది. ఒక దశలో స్థానికులు వాహనాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, కొన్ని క్షణాలు వాహనం ఆగినా జగన్ గమనించకుండా అభిమానులకు అభివాదం తెలపడంలోనే మునిగిపోయారు. చుట్టుపక్కల వారంతా అరుస్తున్నా డ్రైవరు ఏం జరిగిందనే విషయం పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

    YS Jagan : పూర్తి ఆధారాలతో..

    ఘటన జరిగిన రోజు ఎస్పీ సతీష్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్ జగన్​ మోహన్​రెడ్డి ర్యాలీలో ఉన్న వాహనం సింగయ్యను ఢీకొందని తెలిపారు. అప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్​ఐఆర్​లో గుర్తుతెలియని వాహనం ఢీకొందని కేసు నమోదు చేశారు. కానీ, ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోలో సింగయ్య జగన్ వాహనం కింద పడిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. చివరికి సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీలు, డ్రోన్‌ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి ఆధారాలతో నిర్ధారణకు వచ్చారు.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...