Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ బ్లాక్​ చేయించిన పోలీసులు తాజాగా.. అన్వేష్​కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంకు చెందిన అన్వేష్​ యూట్యూబ్​లో ఫేమస్​ అయ్యాడు. పలు ప్రాంతాలను సందర్శించి ఆ వీడియోలను యూట్యూబ్​లో పెట్టేవాడు. ఇతర దేశాల సంస్కృతి, అలవాట్లను తన వీడియో ద్వారా పరిచయం చేసేవాడు. దీంతో అతడి యూట్యూబ్​ ఛానెల్​ ‘నా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ బ్లాక్​ చేయించిన పోలీసులు తాజాగా.. అన్వేష్​కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంకు చెందిన అన్వేష్​ యూట్యూబ్​లో ఫేమస్​ అయ్యాడు. పలు ప్రాంతాలను సందర్శించి ఆ వీడియోలను యూట్యూబ్​లో పెట్టేవాడు. ఇతర దేశాల సంస్కృతి, అలవాట్లను తన వీడియో ద్వారా పరిచయం చేసేవాడు. దీంతో అతడి యూట్యూబ్​ ఛానెల్​ ‘నా అన్వేషణ’కు భారీగా సబ్​స్క్రైబర్స్​ పెరిగారు. అయితే కొన్ని రోజుల క్రితం అన్వేష్​ హిందు దేవతల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

Anvesh Lookout Notice | కరాటే కల్యాణి ఫిర్యాదుతో..

పలు ప్రాంతాల్లో అన్వేష్​పై ఫిర్యాదులు చేశారు. అయితే సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ సైతం బ్లాక్​ చేయించారు. దీంతో తనకు రెండు ఇన్​స్టా, రెండు యూట్యూబ్​ అకౌంట్లు ఉన్నాయంటూ అన్వేష్​ మరో వీడియో విడుదల చేశాడు. మరోవైపు కరాటే కల్యాణి ఈ కేసును వదలకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ.. అన్వేష్​కు లుకౌట్​ నోటీసులు వస్తాయని చెప్పారు. ఈ మేరకు తాజాగా పంజాగుట్ట పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. మరోవైపు అతడి అకౌంట్లపై ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​కు లేఖ రాసేందుకు సిద్ధం అవుతున్నారు.

Anvesh Lookout Notice | నెటిజన్ల ఫైర్​

అన్వేష్​ హిందు దేవతలపై చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఖండించారు. అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి చానెల్​ను అన్​సబ్​స్క్రైబ్​ చేశారు. దీంతో గతంలోనే అన్వేష్​ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. కాగా అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఇండియాకు రాగానే అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.