అక్షరటుడే, బాల్కొండ : Farewell Party | యువత వ్యసనాలకు బానిస కాకుండా మంచి నడవడికతో జీవితం ముందుకు సాగాలని ఎస్సై శైలేందర్ (SI Shailender) సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని (Balkonda Mandal) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సై ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు.
Farewell Party | స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి..
ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల (Dharpally Government Junior College) ప్రిన్సిపాల్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటినుండే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా చదువుతూ భవిష్యత్తులో మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. యువత ఎట్టిపరిస్థితుల్లో దుర్వ్యసనాలకు బానిసలు కావొద్దని సూచించారు. సోషల్‌మీడియాను (Social Media) సరిగ్గా వాడుకోవాలని దాని ద్వారా చెడుమార్గంలో వెళ్లవద్దని పేర్కొన్నారు. బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Farewell Party | సమయం తక్కువగా ఉన్నందున..
బాల్కొండ కళాశాల (Bolkonda College) ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ మాట్లాడుతూ.. పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున విద్యార్థులు మరింత కష్టపడి చదివాలని సూచించారు. పరీక్షలు బాగా రాసి కళాశాలకు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.