అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : World Brain Stroke Day | గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తేనే.. రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రముఖ న్యూరో సర్జన్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.
అక్టోబరు 29న ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే Brain Stroke సందర్భంగా ‘అక్షరటుడే’ (Akshara Today) తో డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడారు.
స్ట్రోక్ అనేది మెదడు (brain) లో రక్త ప్రసరణ blood flow ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి అని చెప్పారు.
World Brain Stroke Day | గోల్డెన్ అవర్ అంటే..
ప్రపంచవ్యాప్తంగా worldwide ప్రతి 4 సెకన్లకు ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురవుతున్నారని ఆదిత్య చెప్పారు. స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 – 5 గంటలను ‘గోల్డెన్ అవర్’గా అని పిలుస్తారన్నారు.
ఈ సమయం లోపల రోగికి సరైన చికిత్స అందితే మెదడు నష్టాన్ని గణనీయంగా తగ్గించి, రోగి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆలస్యం జరిగిన ప్రతి నిమిషం వేల మెదడు కణాల నష్టానికి దారితీస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. వెంటనే సరైన చికిత్స అందుకోవాలన్నారు.
