అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్(Collectorate) వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళాశక్తి భవనం(Mahila Shakti Bhavan) పనులను గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణ పనులను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు రూ.5 కోట్లతో నిర్వహిస్తున్నారని తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలో ఈవీఎం గోదాం(EVM Godown)ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, ఇతర ఇంజినీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.