అక్షరటుడే, ఇందూరు : Nizamabad | ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణం చేసే సమయంలో సీటు కోసం ప్రజలు పడే తిప్పలు అనేకం. బస్టాండ్‌లోకి బస్సు రాగానే.. సీటు దక్కించుకోవాలని చాలా మంది కిటీకిల్లోనుంచి కర్చిఫ్లు, టవాళ్లు, బ్యాగులు వేస్తుంటారు. అయితే ఓ మహిళ ఏకంగా మూడు తులాల బంగారం, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్‌ను సీటు కోసం కిటికీలో నుంచి వేసింది.
బోధన్ (Bodhan) పట్టణానికి చెందిన సుగుణ అనే మహిళ శనివారం నిజామాబాద్ (Nizamabad) నుంచి బోధన్ ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి సిద్ధమైంది. అధిక జనాలు ఉండడంతో బస్సులో సీటు కోసం కిటికీ నుంచి బ్యాగును వేసింది. తీరా బస్ ఎక్కి చూడగా బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగ్‌లో మూడు తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పర్వేజ్‌కు విషయం చెప్పింది. దీంతో ఆయన బస్ అంతా తనిఖీ చేయగా.. వెనక సీటు కింద బ్యాగ్ కనిపించింది. అందులోని బంగారం, సెల్‌ఫోన్ అలాగే ఉండటంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. అనంతరం పోలీసులు బ్యాగ్‌ను ఆమెకు అప్పగించారు. దీంతో వారికి సుగుణ ధన్యవాదాలు తెలిపారు.