అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mumbai Airport | ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికురాలు పొట్టలో క్యాప్సుల్స్ రూపంలో కొకైన్ తరలిస్తుండగా అరెస్ట్ చేశారు.
తమిళ హీరో సూర్య (Hero Surya) నటించిన ఓ సినిమాలో డ్రగ్స్‌ను పొట్టలో దాచి రవాణా చేస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా ముంబైలో చోటు చేసుకుంది. క్యాప్సూల్స్ రూపంలో కొకైన్‌ను కిలాడి లేడీ పొట్టలో దాచింది. అంతేగాకుండా తెల్లటి పొడి ఉన్న 2 ఆహార ప్యాకెట్లు, ఒక ప్లాస్టిక్ కంటైనర్, పౌచ్ గుళికలు ఆమె బ్యాగ్‌లో తీసుకొని వచ్చింది. అయితే అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. NDPS ఫీల్డ్ టెస్ట్ కిట్ ఉపయోగించి స్వాధీనం చేసుకున్న పదార్థాలను పరీక్షించినప్పుడు కొకైన్‌గా తేలిందని తెలిపారు.
Mumbai Airport | ఇలా చిక్కింది..
ఎంటెబ్బే (ఉగాండా) నుంచి వస్తున్న మహిళా టాంజానియన్ (Tanzanian) ప్రయాణికురాలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడిపోయింది. దీంతో అధికారులు వెళ్లి పరిశీలించగా.. పొట్టలో డ్రగ్స్ ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోని డ్రగ్స్ బయటకు తీశారు. ఆమె వద్ద లభించిన కొకైన్ విలువ రూ.21 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
