Galgotias University AI Controversy | చైనా ఎదుట పరువు తీసిన యూనివర్సిటీ.. ఏఐ సదస్సు నుంచి గెంటివేత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Galgotias University AI Controversy | ఓ యూనివర్సిటీ చైనా ఎదుట భారత్​ పరువు తీసింది. చైనా (china) తయారు చేసిన రోబోటిక్​ డాగ్​ను (Robotic dog) తాము ఆవిష్కరించినట్లు ఏఐ సదస్సులో ప్రదర్శనకు ఉంచింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో (Delhi) ఏఐ సదస్సు (AI Conference) నిర్వహిస్తోంది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Galgotias University AI Controversy | ఓ యూనివర్సిటీ చైనా ఎదుట భారత్​ పరువు తీసింది. చైనా (china) తయారు చేసిన రోబోటిక్​ డాగ్​ను (Robotic dog) తాము ఆవిష్కరించినట్లు ఏఐ సదస్సులో ప్రదర్శనకు ఉంచింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో (Delhi) ఏఐ సదస్సు (AI Conference) నిర్వహిస్తోంది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు యూనివర్సిటీలు, స్టార్టప్​లు తమ ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచాయి. యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ఈ సదస్సుల్లో స్టాల్​ను ఏర్పాటు చేసింది. రోబోడాగ్​ను అందులో ప్రదర్శించారు. యూనివిర్సిటీ ప్రొఫెసర్​ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో దీనిని తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

Galgotias University AI Controversy | నెటిజన్ల ఆగ్రహం

వీడియో వైరల్​ కావడంతో రోబో డాగ్​ గురించి నెటిజన్లు తెలుసుకున్నారు. దానిని చైనా తయారు చేసినట్లు గుర్తించారు. ఇతర దేశంలో తయారు చేసిన రోబో డాగ్​ను కొనుగోలు చేసి తాము తయారు చేసినట్లు చెప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా నెటిజన్లు అయితే దీనిపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో భారత్​ పరువు తీశారంటూ సదరు యూనివర్సిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదం పెద్దది కావడంతో యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. దానిని చైనా నుంచి కొనుగోలు చేశామని తెలిపింది. విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఏఐ సదస్సు నుంచి సదరు యూనివర్సిటీని పంపించి వేసింది. స్టాల్​ నుంచి యూనివర్సిటీ ప్రతినిధులను అధికారులు ఖాళీ చేయించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...