అక్షరటుడే, వెబ్డెస్క్ : KSH International Limited IPO | కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ కంపెనీ 1981లో మహారాష్ట్రలో ప్రారంభమైంది. నాలుగున్నర దశాబ్దాలుగా మోటార్లు(Motors), ట్రాన్స్ఫార్మర్లలో వాడే మాగ్నెట్ వైండింగ్ వైర్లు (Magnet winding wires) తయారు చేస్తోంది.
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ వివిధ రకాల ప్రామాణిక, ప్రత్యేకమైన మాగ్నెట్ వైండిరగ్ వైర్లను తయారు చేస్తుంటుంది. కేర్(Care) నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో అతిపెద్ద ఎగుమతిదారు (Largest exporter) ఈ సంస్థే. ఈ కంపెనీ రూ. 710 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు (IPO) వస్తోంది. ఇందులో కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 420 కోట్లు, పాత షేర్ల అమ్మకం ద్వారా రూ. 290 కోట్లు సేకరించనుంది. ఐపీవో(IPO) ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ భారాన్ని తగ్గించుకోవడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
KSH International Limited IPO | ధరల శ్రేణి..
ఒక్కో షేరు ధరల శ్రేణిని (Price band) రూ. 365 నుంచి రూ. 384 గా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్లో 39 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్బాండ్ వద్ద రూ. 14,976 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్ వేయొచ్చు.
ముఖ్యమైన తేదీలు..
- సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : డిసెంబర్ 16
- ముగింపు తేదీ : డిసెంబర్ 18
- షేర్ల కేటాయింపు : డిసెంబర్ 19 రాత్రి
- లిస్టింగ్ తేదీ : డిసెంబర్ 23
కోటా వివరాలు..
మొత్తం ఐపీవో షేర్లలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం కోటా కేటాయించారు.