అక్షరటుడే, ఆర్మూర్: PCC Chief | మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్లో గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని (Nizamabad parliamentary constituency) ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికల (municipal elections) సన్నాహకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
PCC Chief | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకోవాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, అధికార ప్రతినిధి ఏబీ చిన్న, రామకృష్ణ, కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కుమార్, మానాలా మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, కేశ వేణు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.