అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shravana Masam | శ్రావణ మాసం(Shravana Masam) ప్రారంభమైంది. ఇది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున త్రిమూర్తులలో ఒకరైన మహాదేవుడిని జలముతో అభిషేకించి, బిల్వ పత్రాలతో అర్చిస్తే విశేష ఫలితముంటుందని భక్తులు (Devotees) నమ్ముతారు. ఈ నేపథ్యంలో అసలు మహాశివుడికి, బిల్వ పత్రాలకు సంబంధమేమిటన్న విషయం తెలుసుకుందామా..
శివుడు అభిషేక ప్రియుడు. జలంతో అభిషేకించినా భక్తుల కోరికలు తీర్చే బోలాశంకరుడు. ఆ పరమశివుడికి ఇష్టమైన వాటిలో బిల్వ పత్రం ఒకటి. అందుకే ఆయనకు జలంతో అభిషేకం చేసి, బిల్వ పత్రం సమర్పించినా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆ సదాశివుడికి బిల్వ పత్రం అంటే ఎందుకంత ప్రీతి అన్న దానికి శివపురాణం (Shiva puranam) ఇలా చెబుతోంది. సముద్ర మథనంలో తొలుత హాలాహలం వచ్చింది.
లోకాన్ని రక్షించడం కోసం మహాశివుడు(Maha Shivudu) ఆ గరళాన్ని స్వీకరించి, కంఠంలో నిలిపాడు. ఈ విషం(Poison) ప్రభావం వల్ల శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతోపాటు గొంతు నీలంగా మారింది. పరమశివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమిపై ఉన్న సకల జీవరాశులు ఇబ్బందిపడ్డాయి. దీంతో విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివుడికి జలంతో అభిషేకం చేసి, బిల్వ పత్రాన్ని(Bilva Patram) సమర్పించారు. బిల్వ పత్రాలు చల్లబరిచే గుణాన్ని కలిగి ఉన్నందున దాన్ని తిన్న తర్వాత విష ప్రభావం తగ్గింది. అందుకే అప్పటి నుంచి పరమేశ్వరుడికి బిల్వ పత్రాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది. ఆ దేవదేవుడిని అభిషేకించి, బిల్వ పత్రాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు లబిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
Shravana Masam | బిల్వ పత్రాలను ఎలా సమర్పించాలంటే..
- బిల్వ పత్రంలోని మృధువైన ఉపరితలం వైపు మాత్రమే శివుడికి సమర్పించాలి.
మూడు(Three) కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలను సమర్పించాలి. 3, 5, 7 వంటి బేసి సంఖ్యలలో ఉపయోగించాలి. - మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలను త్రిమూర్తుల స్వరూపం(Symbolize the trinity of Brahma, Vishnu, Shiva)గా భావిస్తారు. దీనిని త్రిశూల రూపంగానూ పరిగణిస్తారు. అందుకే శివయ్యను త్రిపత్ర బిల్లాలతో అర్చిస్తారు.
- మధ్యవేలు, ఉంగరపు వేలు, బొటన వేలితో పట్టుకుని మాత్రమే ఆ నీలకంఠుడికి అందించాలి.
బిల్వ పత్రాలు ఎప్పుడూ అపవిత్రం కావు. అప్పటికే శివుడికి సమర్పించిన బిల్వ పత్రాలను కడిగి మళ్లీ పూజలో వినియోగించవచ్చు. - బిల్వ పత్రాలను సమర్పించిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించాలి.