అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా లేదు. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (Election Commission)చర్చించి చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే విధించడం, సుప్రీంకోర్టు (Supreme Court) సైతం ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.
Local Body Elections | మళ్లీ నోటిఫికేషన్
పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేశాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది కాదా అని ఈసీని ప్రశ్నించింది. అదే నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని అడిగింది. అయితే ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservation) అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దీంతో దానిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంతో చర్చించాక మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government), ఎన్నికల సంఘం కోర్టును కోరాయి. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.