అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally Congress | ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం కేసీఆర్‌ను విచారిస్తే తప్పేమిటని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) విలేకరుల సమావేశం నిర్వహించారు.
Kammarpally Congress | భయం లేకపోతే నిరసనలెందుకు..
కేసీఆర్ (KCR) ఎలాంటి తప్పు చేయనప్పుడు సిట్ విచారణకు వెళ్లే భయమెందుకని వేణుగోపాల్ యాదవ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాపాలన కోసం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాటు పడుతుంటే బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Kammarpally Congress | 400 మంది వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్..
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సుమారు 400 మంది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారని వేణుయాదవ్ అన్నారు. అలాంటి సమయంలో సిట్ విచారణకు (SIT Investigation) ఆదేశించిందన్నారు. ట్యాపింగ్‌కు సంబంధం లేదని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు విచారణ చేస్తే భయమెందుకుని ప్రశ్నించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.