ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ముంబై ఇండియన్స్ తొండాట.. నిజం ఏంటంటే?

    IPL 2025 | ముంబై ఇండియన్స్ తొండాట.. నిజం ఏంటంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో మరో కొత్త వివాదం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan royals)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai indians) 100 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్​ రోహిత్ శర్మ(Rohit sharma) నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రివ్యూ కోరడం.. అంపైర్లు అనుమతించడం వివాదాస్పదమైంది. రాజస్థాన్ రాయల్స్ RR బౌలర్ ఫజలక్ ఫరూఖీ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు.

    డీఆర్‌ఎస్ DRS తీసుకోవాలా? వద్దా? అని సహచర ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో చర్చించాడు. ఈ క్రమంలో 15 సెకన్లు గడువు ముగిసింది. సరిగ్గా టైమర్ జీరో అయ్యే సమయంలో రోహిత్ శర్మ(Rohit sharma) రివ్యూ కోరగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌కు వెలుపల పిచ్ అయిందని తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ అవకాశంతో రోహిత్ శర్మ(53) హాఫ్ సెంచరీతో చెలరేగి ముంబై ఇండియన్స్ MI విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    అయితే రూల్స్ ప్రకారం 15 సెకన్ల వ్యవధిలోనే డీఆర్‌ఎస్ DRS తీసుకోవాలి. సమయం ముగిసిన తర్వాత రివ్యూ కోరినా.. అంపైర్లు పట్టించుకోరు. కానీ ఈ మ్యాచ్‌లో గడవు ముగిసిన తర్వాత రోహిత్ రివ్యూ కోరడం.. అంపైర్ umpire పరిగణలోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇది నిబంధనలకు విరుద్దమని, ముంబై ఇండియన్స్ తొండాట ఆడుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అంపైర్లను ముంబై ఇండియన్స్ కొనేసిందని కూడా ఆరోపించారు.

    అయితే నిర్ణీత సమయంలోనే రోహిత్ శర్మ రివ్యూ కోరాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టైమర్ జీరో అయ్యే సమయానికే రోహిత్ రివ్యూ కోసం సైగ చేశాడని, వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు. ఇందులో అంపైర్ల తప్పిదం ఏ మాత్రం లేదని, ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని వివరణ ఇస్తున్నారు.

    నిబంధనల ప్రకారం, ఆటగాడు 15 సెకన్లలోపు రివ్యూ కోసం సైగ చేయడం ప్రారంభిస్తే అది చెల్లుబాటు అవుతుందని, బహుశా ఇదే కారణంతో థర్డ్ అంపైర్ రివ్యూ(Third umpire review)ను పరిగణలోకి తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. ఈ వివాదంపై ఇప్పటికైతే మ్యాచ్ అధికారుల నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ అభిమానుల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    Latest articles

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    More like this