అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLA Bhupathi Reddy | సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) సూచించారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లోని నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ (Sarpanches), ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
MLA Bhupathi Reddy | ప్రజల్లోకి వెళ్లాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామ సర్పంచ్ పోగుల అనిత సాయి కృష్ణ, వార్డు సభ్యులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. డిచ్‌పల్లి మండలం యానంపల్లి సర్పంచ్ తోట భాస్కర్, వార్డు సభ్యులు కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.