అక్షరటుడే, ఇందూరు : Matam Pawan | నగరంలో 8వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని 8వ వార్డు బీజేపీ అభ్యర్థి మఠం పవన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని డివిజన్లోని కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Matam Pawan | అభివృద్ధికే పట్టంగట్టాలి..
డివిజన్ సమస్యలను తెలుసుకొని అభివృద్ధి చేసే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని మఠం పవన్ అన్నారు. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో (Sitaram Nagar Colony) మంగళవారం ప్రచారం నిర్వహించారు. గతంలో తాను డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. కాలనీల్లో సమస్యలపై అవగాహన ఉందని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు.
Matam Pawan | ఉత్తమ డివిజన్‌గా..
భవిష్యత్తులో 8వ డివిజన్లో నగరంలోనే ఉత్తమ డివిజన్‌గా అభివృద్ధి చేసి చూపిస్తానని మఠం పవన్ స్పష్టం చేశారు. ‘మన ఇందూరు – మన మేయర్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi), ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి గృహ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాలను వివరించారు. డివిజన్లో ప్రతిఇంటికి వెళ్తున్నామని అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.