అక్షరటుడే, ఇందూరు : Jinka Tara Raju | ప్రజలు ఆశీర్వదించి తనను కార్పొరేటర్ (Corporator)గా గెలిపిస్తే 16వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ అభ్యర్థిని (BRS Candidate) జింక తార రాజు అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Jinka Tara Raju | ప్రజల మధ్యే ఉండి సేవచేస్తా..
ఈ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. బీఆర్ఎస్(BRS)కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజల మధ్య ఉండి సేవ చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
Jinka Tara Raju | కొట్లాడి నిధులు తీసుకొస్తా..
నగరాభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా (Bigala Ganesh Gupta) పదేళ్లలో ఎంతో కృషి చేశారన్నారు. డివిజన్లకు రూ.లక్షల్లో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని వివరించారు. 16వ డివిజన్లోని ఆయా కాలనీల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డివిజన్ ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.