అక్షరటుడే, ఇందూరు: Legal Services Authority | ర్యాగింగ్‌కు పాల్పడడం నేరమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కరరావు అన్నారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలను (Nizamabad Medical College) సోమవారం సందర్శించారు.
Legal Services Authority | విద్యార్థులకు అవగాహన కల్పించాలి
రెండు రోజుల క్రితం కళాశాలలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను యాంటీ ర్యాగింగ్ కమిటీ (Anti-Ragging Committee) సభ్యుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌కు పాల్పడకుండా కమిటీ ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అవగాహన కార్యక్రమాలతో పాటు వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే లీగల్ సెల్ 9440901057కు సంప్రదించాలని సూచించారు. జడ్జి వెంట లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ రాజ్ కుమార్ సుబేదార్, బాలాజీ, విశ్వక్ తదితరులున్నారు.
Legal Services Authority | తల్లిదండ్రుల ఫిర్యాదు
మెడికల్ కళాశాల (Medical College) నాలుగో సంవత్సరం విద్యార్థి రాహుల్ తల్లిదండ్రులు జడ్జి ఉదయభాస్కర రావుకు వినతిపత్రం అందజేశారు. కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్నా.. పట్టించుకునే వారే లేరన్నారు. కనీసం తమకు కూడా సమాచారం అందించలేరని వాపోయారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.