Bhiknoor Mandal | ఫార్మా కంపెనీని అడ్డుకుంటాం.. నినదించిన భిక్కనూరు యువత

అక్షరటుడే, భిక్కనూరు : Bhiknoor Mandal | మండలంలో ఫార్మా కంపెనీని (Pharma Company) నెలకొల్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్థానిక యువకులు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. అనంతరం భిక్కనూరులోని గాంధీ చౌక్​ (Gandhi Chowk) వద్ద నినాదాలు చేశారు. Bhiknoor Mandal | కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం.. మండలంలో ఫార్మా కంపెనీని ఏర్పాటును వ్యతిరేకించాలని యువకులంతా తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. […]

అక్షరటుడే, భిక్కనూరు : Bhiknoor Mandal | మండలంలో ఫార్మా కంపెనీని (Pharma Company) నెలకొల్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్థానిక యువకులు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. అనంతరం భిక్కనూరులోని గాంధీ చౌక్​ (Gandhi Chowk) వద్ద నినాదాలు చేశారు.

Bhiknoor Mandal | కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం..

మండలంలో ఫార్మా కంపెనీని ఏర్పాటును వ్యతిరేకించాలని యువకులంతా తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఫ్యాక్టరీ వద్దు.. భిక్కనూరు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఫార్మా కంపెనీల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఫార్మా కంపెనీని అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా నినదించారు.

Bhiknoor Mandal | 7న భిక్కనూరు బంద్​..

ఈనెల 7వ తేదీన భిక్కనూరు మండలంలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నిరసనగా 7న బంద్​ నిర్వహించనున్నట్లు  ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Related articles

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.