అక్షరటుడే, బోధన్ : Bodhan Municipality | బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామని 24వ వార్డు బీజేపీ అభ్యర్థి కండెల దుర్గాప్రసాద్ (Kandela Durgaprasad) అన్నారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని వార్డులో ప్రచారం నిర్వహించారు.
Bodhan Municipality | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక పథకాలు..
ఈ సందర్భంగా 24వ వార్డు బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (BJP Government) అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana), బేటీ బచావో బేటీ పడావో, ముద్రా యోజన, ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తోందన్నారు.
Bodhan Municipality | బోధన్ పట్టణంలో..
పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా 24వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి, ఏబీవీపీ నాయకుడు లక్ష్మణ్ జోహన్ తదితరులు పాల్గొన్నారు.