అక్షరటుడే, నిజాంసాగర్:Library organization | గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి(Chairman Maddi Chandrakanth Reddy) అన్నారు. సోమవారం ఆయన నిజాంసాగర్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని(Library) సందర్శించారు. గ్రంథాలయంలోని పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాభివృద్ధి(Library Development), పాఠకులకు మెరుగైన సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్, నాయకులు రాము రాథోడ్ ఉన్నారు.