అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP President Nabin | మున్సిపల్ ఎన్నికల (Municipal Election) ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా (President Nitin Nabin Sinha) బుధవారం రాష్ట్రానికి వచ్చారు. మహబూబ్‌నగర్‌లో (Mahbubnagar) జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
తొలిసారి రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబిన్‌కు కాషాయ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress government) విరుచుకుపడ్డారు. హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించినా, మా పండుగలను ఆపడానికి ప్రయత్నించినా చూస్తూ ఊరుకోమన్నారు. అలా చేస్తే కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉండదని హెచ్చరించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం భారతదేశ ఆత్మ అన్నారు. దానిని అగౌరవపరచాలని నిర్ణయించుకుంటే, బీజేపీ కార్యకర్తలు మౌనంగా ఉండరని స్పష్టం చేశారు.
BJP President Nabin | నిధులను మళ్లించారు
కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని బీజేపీ అధ్యక్షుడు గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనారిటీలకు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందన్నారు. ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
BJP President Nabin | హామీలు అమలు చేయలేదు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెబుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి.. ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, రాహుల్ గాంధీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. బీజేపీని చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.