అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponnam | హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ (Karimnagar) జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. శనివారం ఆయన హుస్నాబాద్ జిల్లలగడ్డ వద్ద అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.
హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. అయితే 2016లో జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాలో కలిపారు. దీనిపై మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉండాలన్నది అక్కడి ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.
Minister Ponnam | గతంలోనే ప్రకటించారు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హుస్నాబాద్‌ను కరీంనగర్ లో కలుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. స్థానిక శాసన సభ్యుడిగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల మార్పులు చేర్పులు జరిగితే హుస్నాబాద్‌ను కరీంనగర్లో కలపడం తథ్యం అని స్పష్టం చేశారు.
Minister Ponnam | గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిశీలన
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట గౌరవెల్లి ప్రాజెక్టు (Gouravelli Project)ను పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గౌరవెల్లి నుంచి మల్లారం వరకూ బైక్ నడుపుతూ కుడి కాలువను పరిశీలించారు. కాలువలకు చేయాల్సిన మరమ్మతులు, తొలగించాల్సిన చెట్ల పొదలపై అధికారులకు పలు సూచనలు చేశారు.