అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | నిజామాబాద్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పాంగ్రా మాజీ సర్పంచ్, బీసీ స్థానిక నాయకులు అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై (BRS Party) ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.
BJP Nizamabad | బీజేపీపై నమ్మకంతో ఉన్నారు..
నగర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని దినేస్ కులాచారి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు. అదే నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.