అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal Municipality | భీమ్గల్ మున్సిపాలిటీపై (Bheemgal Municipality) బీజేపీ జెండా ఎగరేస్తామని మాజీ ఎంపీపీ కొండ గోదావరి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వ పటిమ, దేశాభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న సంస్కరణలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు ఆమె పేర్కొన్నారు.
Bheemgal Municipality | బీజేపీ పాలనకు ఆకర్షితులై..
భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల బరిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె 5వ వార్డు నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు పూస రాజుతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పాలనకు ఆకర్షితురాలినై పార్టీలో చేరానని.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె అన్నారు.
Bheemgal Municipality | పార్టీ బలోపేతానికి నిదర్శనం..
బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎంపీపీ గోదావరి లాంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడం వల్ల భీమ్గల్లో బీజేపీ మరింత బలోపేతమైందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని, ఇదే ఉత్సాహంతో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని పేర్కొన్నారు. కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, నాయకులు యోగేశ్వర్ నర్సయ్య, లక్ష్మణ్ గౌడ్, నిచ్చమొల్ల నవీన్, హరిప్రసాద్, సంధ్య రాజు తదితరులు పాల్గొన్నారు.