Homeజిల్లాలుకామారెడ్డిIndiramma sarees | ఇంటింటికీ బొట్టుపెట్టి చీరలు అందజేస్తాం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Indiramma sarees | ఇంటింటికీ బొట్టుపెట్టి చీరలు అందజేస్తాం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఉమ్మడిజిల్లాలో మహిళలకు ఆదివారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ప్రతిఒక్క మహిళలకు తప్పకుండా చీరల పంపిణీ చేపడ్తామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma sarees | డ్వాక్రా మహిళల(Dwakra) ద్వారా ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందజేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మాచారెడ్డి మండల కేంద్రంలో చీరల పంపిణీ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మహిళల ఆత్మ గౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు.

అంబేడ్కర్(Ambedkar)​ ఆశయ సాధన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇందిరమ్మ జయంతి (Indira Gandhi) సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన చీరలు లబ్ధిదారులు పంటలకు రక్షణగా కట్టేవారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు పండుగలకు, శుభకార్యాలకు కట్టుకునేలా ఉండేలా రూపొందించినట్లు పేర్కొన్నారు.

సౌదీ అరేబియా మృతులకు సాయంపై సీఎం స్పందన అభినందనీయం..

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు అగ్ని ప్రమాదంలో 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సత్వరంగా, నిర్ణయాత్మకంగా స్పందించడం అభినందనీయమని షబ్బీర్ అలీ తెలిపారు.

కామారెడ్డి పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా ఘటనపై సీఎం స్పష్టమైన ఆదేశాలతో బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించామన్నారు.

సీఎం సూచనల మేరకు ఆలస్యం లేకుండా ప్రత్యేక హెల్ప్​లైన్ కౌంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి, ఆదుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, ప్రభుత్వ అధికారుల బృందాన్ని నియమించారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో ప్రత్యేకంగా మాట్లాడి సౌదీ అరేబియాలోని భారతీయులకు పూర్తి సహకారం అందేలా చేశారన్నారు.

అదేరోజు.. రాష్ట్ర మంత్రివర్గం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బాధిత కుటుంబ సభ్యులను అధికారిక ప్రతినిధి బృందంతో పాటు అన్ని ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించి సౌదీ అరేబియాకు వెళ్లడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మస్జిద్-ఎ-నబావిలో సలాత్ అల్-జనాజా తర్వాత మదీనాలోని జన్నతుల్ బాకీలో హైదరాబాద్ ఉమ్రా యాత్రికుల అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించబడ్డాయన్నారు.

ఆలూర్​లో ఇందిరమ్మ చీరల పంపిణీ..

అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండలకేంద్రంలో ఇందిరా మహిళా శక్తి–మహిళా స్వయం సహకార సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం భూమేశ్వర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడేలా ఇందిరమ్మ చీరల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణ సౌకర్యాలు, వృత్తి అభివృద్ధి శిక్షణలు, ఆదాయోత్పాదక కార్యకలాపాలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. చీరలు అందుకున్న మహిళలు ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, ఆలూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిరంజీవి, భాస్కర్ సంజీవ్, నారాయణ కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, రాము, రాజు, సీసీ ప్రకాష్, వీవో రోజా, లత, రేఖ మహిళా సంఘo సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పోచంపాడ్​లో..

పోచంపాడు ప్రాజెక్టు (Pochampad Project) బతుకమ్మ చీరలు పంపిణీ ఈ కార్యక్రమంలో గంగారెడ్డి చందు డాక్టర్ వహీద్ రమేష్ ఇలియాస్ సీతారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కమ్మర్​పల్లిలో..

అక్షరటుడే, కమ్మర్​పల్లి: మండల కేంద్రంలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో కమ్మర్​పల్లి (Kamamrpally) వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలను ప్రత్యేకంగా తయారుచేయించి పంపిణీ చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో కమ్మర్​పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న, కమ్మర్​పల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, బోనగిరి లక్ష్మణ్, ఆవారి సత్యం, సల్లూరి గణేష్, బుచ్చి మల్లయ్య, అశోక్, పాలెపు రాజేశ్వర్, శివానందం, మల్లయ్య, భాజన్న, సెర్ప్​ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

పెద్దకొడప్​గల్​లో..

అక్షరటుడే, పెద్దకొడప్​గల్:​ మండలంలోని కాటేపల్లి గ్రామంలో (Peddakodapgal) ఐకేపీ(IKP) ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. డ్వాక్రా మహిళలు సహజ మరణం పొందితే అప్పటి వరకు ఉన్న రుణం మొత్తం మాఫీ చేస్తారన్నారు.

సంక్షేమ పథకాలు అందని వారు డిసెంబర్ 1నుండి 9 వరకు జరిగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీవో, వీవోఏ సంతోష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహిద్దీన్ పటేల్, నాయకులు మల్లప్ప పటేల్, శ్యామప్ప, గంగాగౌడ్, ఆకుల పర్వయ్య, మొగలా గౌడ్, ఇస్మాయిల్ పటేల్, అశోక్, రవీందర్, సాయిలు, శంకర్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.