అక్షరటుడే, ఇందూరు : Matam Pawan | బీజేపీతోనే నగరాభివృద్ధి సాధ్యమని 8వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి (BJP Corporator Candidate) మఠం పవన్ అన్నారు. సాయినగర్ (Sainagar)లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Matam Pawan | ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో..
ఈ సందర్భంగా మఠం పవన్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీజేపీ నేతలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
Matam Pawan | 8వ డివిజన్లో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు..
డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించి, వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. తనను గెలిపిస్తే ప్రజాసేవకు పూర్తిగా అంకితమవుతానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు విస్తృత లబ్ధి చేకూరుతోందని ఆయన తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా ఇళ్లు, ఉజ్వల యోజన కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందుతున్నాయని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో 8వ డివిజన్లో బీజేపీ విజయం సాధిస్తుందని మఠం పవన్ ధీమా వ్యక్తం చేశారు.