అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former minister Jagadish Reddy | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ న్యాయబద్దంగా వ్యవహరించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Jagtial MLA Sanjay) అనర్హత పిటిషన్ కొట్టివేయడంపై ఆయన స్పందించారు.
జగిత్యాల ఎమ్మెల్యేపై జగదీశ్‌రెడ్డి అనర్హత పిటిషన్ వేయగా.. దానిని బుధవారం స్పీకర్ (Speaker Gaddam Prasad Kumar) డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా.. స్పీకర్ గారికి కనపడకపోవడం విచారకరం అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ చర్యలపై ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడటం లేదా అని ప్రశ్నించారు.
Former minister Jagadish Reddy | అది చట్టవిరుద్ధమే..
ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారని మాజీ మంత్రి అన్నారు. స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్ట పరంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారని విమర్శించారు. స్పీకర్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమేనని స్పష్టం చేశారు. స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదన్నారు. వాళ్లను డిస్పస్ చేయడం ఖాయమని జగదీశ్‌రెడ్డి అన్నారు. స్పీకర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.