అక్షరటుడే, ఇందూరు : Ramarthi Gopi | నిజామాబాద్ (Nizamabad) మున్సిపల్ కార్పొరేషన్లోని ఏడో డివిజన్ను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి (Congress Corporator Candidate) రామర్తి గోపి అన్నారు. ఈ మేరకు బుధవారం డివిజన్లో ప్రచారం నిర్వహించారు.
Ramarthi Gopi | హామీలిస్తూ.. ముందుకు కదులుతూ..
ఈ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీల్లో రామర్తి గోపి ఇంటింటికి ప్రచారం చేశారు. ప్రజలందరితో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎక్కువగా డ్రెయినేజీ సమస్య కారణంగా రోగాలబారిన పడుతున్నామని వారు పేర్కొనగా తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. గెలిపిస్తే కాలనీలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
Ramarthi Gopi | కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కీలక పథకాలను అమలు చేస్తోందని రామర్తి గోపి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) కింద రూ.5లక్షలు అందజేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి రైతు భరోసా (Rythu Bharosa) పథకం ద్వారా సాగుకు పెట్టుబడి సహాయం, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Ramarthi Gopi | యువతకు ఉపాధి అవకాశాలు..
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువ వికాసం, నిరుద్యోగులకు భవిష్యత్తు భరోసా కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏడొ డివిజన్లో తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు, వీధిదీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని గోపి హామీ ఇచ్చారు. ప్రజల మద్దతుతో గెలిచి, డివిజన్ను నగరానికే ఆదర్శంగా నిలిపేలా పని చేస్తానని చెప్పారు.