- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిEeravatri Anil | ఇసుకను హోం డెలివరీ చేస్తాం: టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్

Eeravatri Anil | ఇసుకను హోం డెలివరీ చేస్తాం: టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Eeravatri Anil | రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను హోం డెలివరీ (sand Home delivery) చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఈరవత్రి అనిల్​ (State Mineral Development Corporation Chairman Eeravatri Anil) పేర్కొన్నారు. హైదరాబాద్​లో బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు సాండ్ బజార్స్, స్టాక్‌యార్డ్స్ (Stockyards) నుంచి ప్రజల ఇంటి వద్దకే ఇసుకను చేర్చే ఒక వ్యవస్ధను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ “https://sand.telangana.gov.in/ TGSandBazaarPortal/Masters/Home.aspx” అనే ఆన్‌లైన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఇసుకను హోమ్ డెలివరీ చేస్తామని వివరించారు.

Eeravatri Anil | ఫిబ్రవరి నుంచి ఇసుక విధానంలో మార్పులు..

ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచే ఇసుక రవాణా వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. ఇసుక రీచ్​ల నుంచి స్టాక్‌యార్డుకు చేరుకునే వాహనాలకు GPS పరికరాలు, ఇసుక రీచుల వద్ద CC కెమెరాలను అమర్చామన్నారు. ఇసుక అక్రమ రవాణా, వేబిల్స్ sand Way bills లేని వాహనాలను నియంత్రించే ఉద్దేశంతోనే సాండ్​బజార్స్​ను సైతం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

- Advertisement -

Eeravatri Anil | సాండ్​ బజార్స్​ ఎక్కడంటే..

ఈ క్రమంలో మార్చి 17న అబ్దుల్లాపుర్‌మెట్​లో (Abdullapurmet sand bazar​) మార్చి18న బోరంపేట్​లో, మార్చి 19న వట్టినాగులపల్లిలో, ఏప్రిల్ 16న ఆదిబట్లలో సాండ్ బజార్లను ప్రారంభించామని ఈరవత్రి అనిల్​ వివరించారు. అయితే కొన్ని సామాజిక మాద్యమాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సన్న ఇసుక ధర రూ.1800, దొడ్డు ఇసుక ధర రూ.1600 చాలా ఎక్కువ అని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Eeravatri Anil | టన్ను ఇసుక రూ.1,600 వరకు..

గతంలో బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర రూ.2400-2200 మధ్య ఉండేది. కానీ సామాన్య ప్రజలకు కూడా ఇసుక ధర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సీఎం నిర్ణయించిన ప్రకారం.. ఇప్పుడు ఇసుక ధర రూ.1700-1600కు విక్రయిస్తున్నామని స్పష్టం చేశారు.

Eeravatri Anil | వినియోగదారుడు చేయాల్సింది ఇదే..

ఈ విధానంలో వినియోగదారుడు తాను ఎంపిక చేసిన ఇసుక రీచ్​ నుంచి ఇసుక ధర రూ.400తో పాటు ప్రతి టన్ను, ప్రతి కిలోమీటరుకు నిర్ణయించిన మేరకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం 1600 వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉంటాయి. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ప్రతి కిలోమీటర్ కు రూ.3.75 చొప్పున, 200 కిమీ కంటే తక్కువ దూరం ఉంటే ప్రతి కిలోమీటర్ కు రూ.4.25 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News