USA | అమెరికాలో దారుణం.. భార్య, కొడుకును తుపాకీతో కాల్చి తానూ సూసైడ్​ చేసుకున్న భారత టెక్కీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: USA | అమెరికాలో దారుణం జరిగింది. ఓ భారతీయ టెక్కీ భార్య, కొడుకును తుపాకీతో కాల్చి చంపడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్ కుటుంబం అమెరికాలో ఉంటోంది. వాషింగ్టన్​లో స్టేట్​లోని న్యూకాజిల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. కాగా.. ఈ నెల 24న హర్షవర్ధన్​ తన భార్య శ్వేతా పాణ్యం(44), కుమారుడు ధ్రువ(14)ను తుపాకీతో కాల్చి చంపాడు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: USA | అమెరికాలో దారుణం జరిగింది. ఓ భారతీయ టెక్కీ భార్య, కొడుకును తుపాకీతో కాల్చి చంపడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్ కుటుంబం అమెరికాలో ఉంటోంది. వాషింగ్టన్​లో స్టేట్​లోని న్యూకాజిల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. కాగా.. ఈ నెల 24న హర్షవర్ధన్​ తన భార్య శ్వేతా పాణ్యం(44), కుమారుడు ధ్రువ(14)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

USA | హోలో వరల్డ్​ రోబోటిక్స్​ స్థాపించి.. కరోనా ప్రభావంతో తిరిగి అమెరికాకు..

హర్షవర్ధన్​ తన భార్య శ్వేతతో కలిసి 2017లో ఇండియాకు వచ్చి మైసూరు కేంద్రంగా హోలో వరల్డ్(HoloWorld) అనే రోబోటిక్స్ కంపెనీని స్థాపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ప్రధాని మోదీని సైతం కలిసి దేశ సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ఉంచారు. తదనంతరం కరోనా ప్రభావంతో 2022లో హోలో వరల్డ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో తిరిగి వీరి కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. తాజాగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం చర్చకు దారితీసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...