అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DCC President Nagesh Reddy | మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను సర్వే చేసి ఎంపిక చేస్తామని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy) అన్నారు. వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికలు (municipal elections) జరుగనున్న నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలోని సీ కన్వెన్షన్లో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
DCC President Nagesh Reddy | పక్కా ప్రణాళికతో..
మున్సిపాలిటీలో వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం సర్వే (survey) చేస్తామని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ముందుగా ప్రతి వార్డులో ముగ్గురు చొప్పున అభ్యర్థుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి సర్వే చేస్తామన్నారు. అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం అభ్యర్థుల పేర్లను డీసీసీలు, టీపీసీసీలకు పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుందన్నారు.
DCC President Nagesh Reddy | అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి..
ఫైనల్గా అధిష్టానం నిర్ణయించే అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నగేష్ రెడ్డి సూచించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండని వ్యక్తులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలియజేశారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న అభివృద్ధిలో ప్రతి వార్డులో, డివిజన్లో ప్రచారం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏబీ చిన్నా, మార చంద్రమోహన్, ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ ఛైర్మన్లు సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ వైస్ ఛైర్మన్లు లింగ గౌడ్, మున్నా భాయ్, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్, ఇస్సాపల్లి సర్పంచ్ విఠం జీవన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, మహమూద్ అలీ, జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యం తదితరులు పాల్గొన్నారు.