అక్షరటుడే, కామారెడ్డి: Neelam Kalavati Ramesh | పట్టణంలోని పదోవార్డులో ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందేలా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని నీలం కళావతి రమేష్ (Neelam Kalavati Ramesh) అన్నారు. వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Neelam Kalavati Ramesh | బొట్టుపెట్టి.. మేనిఫెస్టో ఇచ్చి..
ప్రచారంలో భాగంగా అభ్యర్థిని నీలం కళావతి రమేష్ వార్డులో మహిళలకు బొట్టుపెట్టి తన మేనిఫెస్టో ప్రతులను ఓటర్లకు అందజేశారు. తాను చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా వార్డు కార్యాలయాన్ని (ward office) ఏర్పాటు చేస్తానన్నారు. ప్రజలు ఆలోచించాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తనకు ఓటువేసి గెలిపించడం ద్వారా అభివృద్ధికి నిధులు వస్తాయని తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
జోరుగా ప్రచారం..
పదోవార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మంగళవారం నుంచి తాను చేయబోయే పనులకు సంబంధించిన మేనిఫెస్టో కరపత్రాలను కళావతి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను, ముఖ్యంగా మహిళా ఓటర్లను కలిసి తనకు ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. తాను చేపట్టే పనులను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.