అక్షరటుడే ఇందూరు : MLA Dhanpal | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) గెలుపొందిన బీజేపీ మద్దతుదారులు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సర్పంచ్‌గా గెలుపొందిన వారిని జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో (Camp Office) బుధవారం సన్మానించారు.
MLA Dhanpal | ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) జిల్లావ్యాప్తంగా విజయం సాధించేందుకు పనిచేయాలన్నారు. పార్టీ అధిష్టానం కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు ఒకే దృష్టితో చూస్తుందన్నారు. గెలుపొందిన సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. బీజేపీ అధిష్టానం గెలిచిన వారికి మద్దతుగా నిలుస్తూ ముందుండి నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో మల్లారం గ్రామ సర్పంచ్ గోపి, వార్డు సభ్యులు, మోస్రా సర్పంచ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

MLA Dhanpal | గ్రామ అభివృద్ధికి పాటుపడాలి: ఎమ్మెల్యే ధన్పాల్